టీడీపీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ బాలే.. ఇప్పుడు బాగుంది..!

తెదేపా ప్రాణంగా, శ్వాసగా బ్రతికారు ఎర్రబల్లి దయాకర్ రావు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీ నుండి తెరాసలో చేరారు. తెరాసలో చేరిన ఎర్రబల్లి దయాకర్ రావు ఆనందంగా ఉన్నారా..లేక ఇంకా ఇబ్బందులు పడుతున్నారా అంటే తనను కేసీఆర్ చాలా బాగా గౌరవిస్తున్నారని, మంత్రి పదవి ఇస్తానంటే తానే వద్దన్నానని వెల్లడించారు ఎర్రబల్లి దయాకర్ రావు. ఇంకా ఆయన మాట్లాడుతూ… తాను టీడీపీలో ఉన్నప్పుడు అధికార పార్టీ ప్రభుత్వం పనితీరు బాగలేదని, అందుకే అప్పట్లో విమర్శించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం చాలా చక్కగా పాలిస్తుందని వివరించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. తాను అమ్ముడు పోలేదని, కొండా సురేఖ సీటుకు నేను ఎసరు పెట్టడం లేదని కూడా చెప్పారు. ఇంకా జంఘా రాఘవ రెడ్డిని తాను కేసుల్లో ఇరికించలేదని, అసలు తాను యాక్టివ్ అయితే చాలా ముద్రలు తన మీద పడతాయని కూడా వివరించారు ఎర్రబల్లి దయాకరరావు. చివరగా తనకు టీఆర్ఎస్ లో ఏమాత్రం అన్యాయం జరగలేదని, మళ్లీ గెలిచాక మంత్రినవుతానని…అసలు తెలంగాణలో టీడీపీని చంద్రబాబు పూర్తిగా వదిలేశారని తెలిపారు ఎర్రబల్లి దయాకరరావు. ఇంకా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే పై వీడియోను క్లిక్ చేయండి.