`హేట్ స్టోరి 4`.. హీట్ పెంచి ట్రాప్‌లో వేస్తుంది!

బాలీవుడ్‌లో ఎన్ని రొమాంటిక్ సిరీస్‌లు ఉన్నా వాట‌న్నిటిలో `హేట్ స్టోరి` స్టైలే వేరు. వేడి పుట్టించ‌డం.. యువ‌త‌రం గుండెల్ని ర‌గిలించ‌డ‌మే ధ్యేయంగా క‌థాంశాలు అల్లుతారు. వాటిని అంతే ర‌స‌వ‌త్త‌రంగా తెర‌పై వండి వార్చ‌డం టీ-సిరీస్ భూష‌ణ్ కుమార్ అండ్ గ్యాంగ్‌కి బాగా అల‌వాటు ప్ర‌క్రియ‌. ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే మూడు సినిమాలు వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు కొల్ల‌గొట్టాయి. అందాల క‌థానాయిక‌ల హీటెక్కించే పెర్ఫామెన్స్ యూత్‌కి ఓ రేంజులో న‌చ్చేసింది. అందుకే బాక్సాఫీస్ గ‌ల‌గ‌ల‌లకు కొద‌వేం లేదు.

2012లో పార్ట్ 1, 2014 లో పార్ట్ -2, 2015లో పార్ట్ -3 వ‌చ్చాయి. ఇప్పుడు 2018 మార్చి 9న‌ హేట్ స్టోరి-4ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఊర్వ‌శి రౌతేలా అంద‌చందాలు మ‌తి చెడ‌గొట్ట‌డం ఖాయం అన్న మాటా వినిపిస్తోంది. విశాల్ పాండ్య ద‌ర్శ‌క‌త్వంలో టీసిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయం అన్న అంచ‌నాలున్నాయి. ఊర్వ‌శి రౌతేలా, క‌ర‌ణ్ వాహి, వివాన్‌, ఇహానా దిల్లాన్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. మిలాప్ జ‌వేరీ డైలాగులు రోమాలు నిక్క‌బొడుచుకునే రేంజులోనూ ఉంటాయిట‌. రివెంజ్‌, రొమాన్స్ బ్యాక్ డ్రాప్‌లో హైపంచ్ రొమాంటిక్‌ థ్రిల్ల‌ర్ ఇద‌ని చెబుతున్నారు.