వైజాగ్‌లో ప్రపంచ మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు…

ప్రపంచ మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సుకు వేదిక కానుంది వైజాగ్… ఈ ప్రపంచస్థాయి సదస్సు ఈ నెల 17, 18, 19 తేదీల్లో వైజాగ్‌లో జరగనుండగా… ఈ సదస్సు బ్రోచర్‌ను మంత్రి గంటా శ్రీనివాస్‌రావు విడుదల చేశారు. సార్క్‌ దేశాల నుంచి 70మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. రాష్ర్టంలో ఇంటర్‌నేషనల్‌‌ ట్రేడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు సర్కార్ 50 ఎకరాల భూమిని కేటాయించినట్టు మంత్రి గంటా తెలిపారు.

విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోందన్నారు మంత్రి గంటా… అన్ని యూనివర్సిటీల నుంచి విద్యార్థినులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నామని… ఒక్కో యూనివర్సిటీ నుంచి ఐదు విద్యార్థులు పాల్గొనేలా చూస్తామన్నారాయన. మహిళా పారిశ్రామికవేత్తలకు ఉన్న అవకాశాలేంటి? వారి ముందున్న చాలెంజెస్‌పై కూడా చర్చలు జరుగుతాయని తెలిపారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడమే లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఎలీప్‌ సంస్థ అధ్యక్షురాలు రమాదేవి తెలిపారు.