సరదాగా కోడిపందాలు ఆడొచ్చు…

సరదాగా కోడిపందాలు నిర్వహించుకోవచ్చు అన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు… సాంప్రదాయాలతో పాటు కోర్టు ఆదేశాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి… కోట్ల రూపాయల బెట్టింగ్‌లు పెడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. కోడిపందాల పేరుతో రింగ్‌లా ఫామై బెట్టింగ్ దందా చేస్తే కుదరదని తేల్చి చెప్పేశారు గంటా. అయితే సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడిపందాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఓవైపు కోడి పందాలు ఆడేందుకు పందెంరాయుల్లు ఏర్పాట్లు చేసుకుంటుంటే మరోవైపు కోడిపందాలు నిర్వహించొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.