అజారుద్దీన్‌కి జరిగిన అవమానంపై పాక్ కోడై కూస్తోంది…

టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కి జరిగిన అవమానంపై పాకిస్థాన్‌ కోడై కూస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు… అవసరం ఉంటే అజర్ భాయ్ అంటారు… అవసరం తీరాక హాట్ ఛల్‌ అంటారా..? అని ఆగ్రహం వ్యక్తంచేసిన వీహెచ్… హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ పేరును వివేక్ చెడగొడుతున్నారని విమర్శించారు. పక్క రాష్టంలో క్రీడలు ఎలా ఉన్నాయి… మన రాష్ట్రంలో ఎలా ఉన్నాయో చూసుకోవాలన్న వీహెచ్… రాజకీయంగా వివేక్ ఏమైనా చేసుకోవచ్చు… కానీ, క్రీడలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.

అజారుద్దీన్ హెచ్‌సీఏ సభ్యులు కాదని మొన్నటి వరకు అన్నారు… కోర్టు అజారుద్దీన్ కి క్లీన్ చీట్ ఇచ్చినా ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు వీహెచ్. అజారుద్దీన్ పై కుట్రతో వివేక్ ఇలా చేస్తున్నారని ఆరోపించిన వి.హనుమంతరావు… 8 నెలల కింద ఫామ్ అయిన ప్యానల్ కి శేష్ నారాయణ సెక్రెటరీ, వివేక్ ప్రెసిడెంట్ అయ్యారని… ఇప్పుడు వివేక్ తో పాటు ఎన్నో ఏళ్లు హెచ్‌సీఏను పాలించిన వినోద్‌ని పెద్ద పోస్ట్‌లో పెట్టాలని వివేక్‌ భావిస్తే… దానికి శేష్ నారాయణ్ ఒప్పుకోనందుకే ఆయన పై సస్పెన్షన్ వేటు వేశారని ఆరోపించారు. ఐపీఎల్ వాళ్లను బెదిరించి లక్షలు వసూళ్లు చేశారని… వివేక్ ఆయన అన్న కలిసి హెచ్‌సీఏని దోచుకుంటున్నారని మండిపడ్డారు వీహెచ్.