పురపాలకశాఖపై కేటీఆర్ సమీక్ష…

పురపాలక శాఖపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్… జలం-జీవంపై కార్యాచరణ తయారు చేయాలని… ఫిబ్రవరి మెదటి వారంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. సాధ్యమైనంత ఎక్కువ మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా కార్యచరణ ఉండాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్.. మిషన్ భగీరథ – అర్బన్ కార్యక్రమంపై సమీక్షించిన మంత్రి… మున్సిపాలిటీలకు విడుదల చేసిన ప్రత్యేక నిధుల ద్వారా జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు.

మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులకు నీర్ణిత గడువు పెట్టుకోవాలని అధికారులకు నిర్ధేషించారు కేటీఆర్… గడువులోగా అనుమతులివ్వకుంటే టీఎస్ ఐపాస్ అనుమతుల మాదిరి అటోమేటిగ్గా అనుమతులు వచ్చేలా చూడాలన్నారు. భవన నిర్మాణల అనుమతుల ప్రక్రియలో ఆలస్యానికి కారణమైన అధికారులకు జరిమానాలు విధించే పద్ధతిని ప్రవేశపెట్టాలని ఆదేశించారు. పార్కింగ్ పాలసీపై ఆరా తీసిన కేటీఆర్… జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రైవేట్ పార్కింగ్‌కు ఉన్న అవకాశాలపై ప్రచారం కల్పించాలని… మల్టీ లెవల్ పార్కింగ్‌కు టెండర్లు పిలవాలన్నారు. నగరంలో కనీసం వంద ఫుట్‌ఒవర్ బ్రిడ్జిల పనులను ప్రారంభించాలని… ఏడాది పాటు ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు కట్టింగ్ అనుమతులివ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు.