తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ

సంక్రాంతి ప్రయాణీకుల రద్దీతో టోల్ గేట్లు కిటకిటలాడుతున్నాయి. హైద్రాబాద్ నుండి సొంతూళ్లకు వెళ్లే జనం పోటెత్తడంతో విజయవాడ హైవే సందడిగా కనిపిస్తుంది. దీంతో యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో విజయవాడ వైపు 11 టోల్ గేట్లను తెరిచారు. అయినా కూడా భారీ క్యూ తప్పడం లేదు. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. హైవేపై భారీగా రద్దీ పెరిగిపోవడంతో చౌటుప్పల్ మండలం లింగోజి గూడెం దగ్గర వాహనాలను ఆపి రద్దీ తగ్గినాక వదులుతున్నారు. మరింత సమాచారం కోసం పైన వీడియోను క్లిక్ చేయండి.