నేటి వార్తా విశేషాలు…

హైద్రాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ మరోకరి ప్రాణం తీసింది. ఫిల్మ్ నగర్ నుంచి గచ్చిబౌలి వెళుతుండగా కారు అదుపుతప్పి డివైడర్ ను డీకొట్టింది, పల్టీలు కొడుతూ చాలా దూరం వెళ్ళింది, చెట్టును గుద్దుకోవడంతో ఆగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న విశ్వజిత్ ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.

ఈ రోజు మధ్యాన్నం తిరుపతి రానున్నారు ఎపి సీఎం చంద్రబాబు నాయుడు. సంక్రాంతి పండగను సొంతూళ్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో కుంటుంబం మొత్తం సాయంత్రం 5గంటలకు నారావారిపల్లెలోని స్వగృహానికి చేరుకోనున్నారు. తల్లిదండ్రుల సమాధుల వద్ద పూజలు నిర్వహించనున్నారు. రేపు మధ్యాన్నం వరం సీఎం అక్కడే గడుపుతారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం పైన వీడియోను క్లిక్ చేయండి.