నల్గొండలో మరో కాంగ్రెస్ నేత దారుణ హత్య…

నల్గొండలో కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై ఓ వైపు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగానే… ఆ జిల్లాలో మరో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. తిరుమలగిరి మండలం నాగార్జునపేట తండాలో కాంగ్రెస్ నేత, గ్రామ ఉప సర్పంచ్ ధర్మా నాయక్‌ను దారుణంగా హత్య చేశారు. ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో మంచంకింద బాంబులు పెట్టి పేల్చేశారు ప్రత్యర్థులు. దీంతో ధర్మానాయక్ శరీరం ముక్కలైపోయింది. పాతకక్షలతోనే ధర్మానాయక్ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

కొద్దివారాల క్రితమే మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య నల్గొండను కుదిపేసింది. తాజాగా మరో కాంగ్రెస్ నేత హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది… అర్ధరాత్రి హత్యకు గురైన ధర్మానాయక్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను క్లిక్ చేయండి…