టాప్‌లో చంద్రబాబు… కేసీఆర్‌కు నాల్గో స్థానం…

తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వెలుగుతున్న ఇద్దరు చంద్రులు… ఆస్తుల్లోనూ వెలిగిపోతున్నారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టాప్ స్పాట్‌లో ఉంటే… తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాల్గో స్థానంలో ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం… రూ.177 కోట్ల విలువైన ఆస్తులతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు చంద్రబాబు. రెండో స్థానంలో రూ. 129 కోట్ల ఆస్తులతో అరుణాచల్ సీఎం పెమాఖండూ, రూ.48 కోట్ల విలువైన ఆస్తులతో మూడో స్థానంలో పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, ఇక మరో తెలుగు రాష్ట్రాం, కొత్తగా ఏర్పడిన తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.15.51 కోట్ల విలువైన ఆస్తులతో నాల్గో స్థానంలో ఉన్నారు.

ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్, నేషనల్ ఎలెక్షన్ వాచ్ సంస్థలు ఈ వివరాలను ప్రకటించాయి. ఇక ఈ జాబితాలో అతితక్కువ ఆస్తులన్నవారిని పరిశీలిస్తే రూ. 26 లక్షల ఆస్తులతో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా… రూ.30 లక్షల ఆస్తులతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రూ. 55 లక్షల ఆస్తులతో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబాముఫ్తీ ఉన్నారు.