షిప్‌యార్డ్‌లో పేలుడు, ఐదుగురు మృతి, 11 మందికి గాయాలు…

కేరళలోని కొచ్చి షిప్ యార్డ్ దగ్గర జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతచెందగా… 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొబైల్ ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ యూనిట్లో మరమ్మతులు జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన యూనిట్ ఓఎన్జీసీకి చెందినది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

పేలుడు సమయంలో రోజువారీ కార్మికులు మరియు కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు మంగళవారం సెలవుదినం కావడంతో షిప్‌యార్డ్‌ సాధారణ కార్మికులు లేరు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతుండగా… గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉండగా… పేలుడుతో వచ్చిన తీవ్రమైన పొగ కారణంగానే మరణాలు సంభవించాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. 1978 లో కార్యకలాపాలు ప్రారంభించిన కొచ్చి షిప్‌యార్డ్‌… భారతదేశంలోనే పురాతన మరియు అతిపెద్ద నౌకానిర్మాణ మరియు నిర్వహణ సదుపాయాలను కలిగి ఉంది.