తొలి టీ-20లో భారత్‌ విజయం…

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ-20లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. భారత ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. మందన(28), హర్మన్ ప్రీత్(0) అవుట్ అయిన తర్వాత మిథాలికి రోడ్రిక్స్‌(37) తోడవ్వడంతో జట్టు విజయం దిశగా దూసుకెళ్లింది. రోడ్రిక్స్‌ పెవిలియన్ చేరాడంతో మిథాలీ, వేద కృష్ణమూర్తి(37) మిగతా పని పూర్తి చేశారు. 48 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచిన మిథాలీరాజ్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ప్రొటీస్ బౌలర్లలో డానియేల్స్, వాన్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. వాన్‌ నీకెర్క్‌(38), ట్రియన్‌(32), డు ప్రీజ్‌(31)లు రాణించారు. భారత బౌలర్లలో అనుజ పాటిల్‌ 2 వికెట్లు తీసింది. ‘ప్లేయర్ అఫ్ ది మ్యాచ్’ మిథాలీరాజ్‌ కు దక్కింది.