చంద్రబాబుతో ముఖేష్ అంబానీ భేటీ…

ప్రముఖ రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబాని ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ముంబయి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న ముఖేష్ అంబానీ అమరావతి సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించారు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ చంద్రబాబుతో పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ సంస్థ పెట్టాలనుకుంటున్న పెట్టుబడులపై ముఖేష్ అంబాని సీఎంతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న సదుపాయాలపై చంద్రబాబు వివరిస్తున్నట్లు సమాచారం.