ఓ మై గాడ్‌! మెగా ఫ్యామిలీ నుంచి కొత్త హీరోయిన్‌?

మెగా ఫ్యామిలీ నుంచి నీహారిక కొణిదెల క‌థానాయిక‌గా స‌త్తా చాటుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కొత్త హీరోయిన్ ఎవ‌రు? అంటూ సందేహం క‌లగొచ్చు. వ‌ల‌దు వ‌ల‌దు.. సందేహం వ‌ల‌దు! ఇదిగో ఇక్క‌డ ఫోటో చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. ఊహించ‌ని రీతిలో … అసాధార‌ణ స్థాయిలో.. స్లిమ్‌గా మారిన ఉపాస‌న రామ్‌చ‌ర‌ణ్ కొత్త రూపంతో క‌థానాయిక‌ను త‌ల‌పిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారాయి. ఉపాస‌న‌లోని ఛేంజోవ‌ర్ అద్భుతం అంటూ ప్ర‌శంసిస్తున్నారంతా. స్వ‌త‌హాగానే ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన ఉపాస‌న ఈ మార్పు కోసం ఎంత‌గా శ్ర‌మించారో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇదంతా క‌ఠోర‌సాధ‌న‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో సాధ్య‌మైన‌దేన‌ని భావించ‌వచ్చు. ఇటీవ‌ల క్లీన్ వీక్ పేరుతో వారం రోజుల పాటూ కేవలం ఆకుకూరలు.. బఠానీలు.. దోసకాయలు.. క్యారెట్లు.. ప‌చ్చి కూర‌గాయ‌లు మాత్రమే తిని ఉన్నాన‌ని ఉప‌స‌న చెబుతున్నారు. ఆ క‌మిట్‌మెంట్ ఏపాటిదో అర్థం చేసుకోవాలి. క్లీన్ వీక్ పూర్తవ్వడంతో ట్విట్టర్ లో త‌న‌ ఫోటోను షేర్ చేశారు. ఇలా ఫోటోను షేర్ చేశారో లేదో అలా జోరుగా వైర‌ల్ అయిపోతోంది. ఆ ఫోటోలో ఉపాసనను చూసిన వారంతా ఎవ‌రైనా కొత్త హీరోయిన్ అయి ఉంటారులే అని భావిస్తున్నారు. ధృవ సినిమా కోసం రామ్‌చ‌ర‌ణ్ ఎంత క‌ఠినోపాస‌న చేశారో, అంత‌కుమించి ఉపాస‌న క‌ష్టం క‌నిపిస్తోంది. ఇది ఎంద‌రికో స్ఫూర్తిని నింపుతోంది. పాజిటివిటీ, స్ట్రెంగ్త్ ఆఫ్ లార్డ్ శివ అంటూ మ‌హాశివ‌రాత్రి విషెస్‌ని ట్విట్ట‌ర్‌లో చెప్పారు ఉపాస‌న‌.