బొమ్మ‌రిల్లు హాసిని `కుచ్ కుచ్ హోతా హై`

కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ – కాజోల్ జంట‌గా న‌టించిన రొమాంటిక్ ల‌వ్‌స్టోరి `కుచ్ కుచ్ హోతా హై`. 1988లో రిలీజైన ఈ చిత్రం మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్. కుటుంబ క‌థా చిత్రాల్లో, రొమాంటిక్ జోన‌ర్‌లో ఓ ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఇది. బాలీవుడ్‌కి క్లాస్ హీరోయిజంని ప‌రిచ‌యం చేసిన చిత్రం కూడా ఇది. ఈ సినిమాతోనే క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌కుడిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. తొలి ప్ర‌య‌త్న‌మే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. షారూక్ కెరీర్‌లో ప్ర‌త్యేక‌మైన సినిమా. అలాగే 1998లో రెండో అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ప్యార్ తో హోనా హై థా .. బ్లాక్‌బ‌స్ట‌ర్. ఆ చిత్రంలోనూ కాజోల్ నాయిక‌.

అప్ప‌టికి, ఇప్ప‌టికి, ఎప్ప‌టికి మ‌రపురాని చిత్ర‌మిది. ఆ సినిమాలో రాహుల్ ఒక ఛీట‌ర్‌గా క‌నిపిస్తాడు. ఆ స‌న్నివేశాన్ని రితేష్ దేశ్‌ముఖ్‌- జెనీలియా ఇమ్మిటేట్ చేసిన తీరు ఎంతో ఇంట్రెస్టింగ్‌. గ‌తాన్ని ఓసారి గుర్తు చేసింది ఈ జంట‌. ఎంతో చిలిపిగా … అల్ల‌రిగా ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఛీట‌ర్ టాస్క్‌, రొమాన్స్ అదిరిపోయింది. మీరు కూడా ఓ లుక్కేయండి ఈ వీడియో.