సెంచరీ చేసిన రోహిత్ శర్మ…

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో తొలిసారి సెంచరీ సాధించాడు. ఇప్పటివరకూ జరిగిన నాలుగు వన్డే మ్యాచ్ లలో విగలమయిన రోహిత్‌ ఐదో వన్డేలో మెరిశాడు. 121 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో భారీ సెంచరీ(115) చేశాడు. భారత్ ఇన్నింగ్స్ ను ఘనంగా ఆరంబించించింది. ధావన్ వచ్చి రావడంతోనే బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌గా శిఖర్‌ ధావన్‌(34, 23 బంతుల్లో 8 ఫోర్లు) అవుటైన తర్వాత గ్రీస్ లో కుదురుకున్న రోహిత్‌ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ధావన్ అవుట్ అయినా తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో కలిసి స్కోర్ ను ముందుకు నడిపాడు. ఈ క్రమంలో కోహ్లీ(36), రహానే(8) త్వరగానే అవుట్ అయ్యారు. రోహిత్ కూడా 115 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే పాండ్య(0) కూడా రోహిత్ ను అనుసరించాడు. ప్రస్తుతం గ్రీస్ లో అయ్యర్(29), ధోని(0)పరుగులతో ఉన్నారు. భారత్ 43ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.