రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి…

శివరాత్రి పూట రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ సమీపంలో ఆటోను టిప్పర్ ఢీకొట్టడంతో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామారావు, కుమారి, అనంత్, బిందుతో పాటు ఆటో డ్రైవర్ వెంకటరమణ కూడా చనిపోయాడు. దైవదర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.

మరోవైపు అతివేగం ఇద్దరి ప్రాణాలను తీసింది. హైదరాబాద్‌ మియాపూర్ అల్విన్‌ కాలనీలో వేగంగా దూసుకొచ్చిన కారు… డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. కారు తుక్కుతుక్కైంది. ఇలా శివరాత్రి వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో… ఏడుగురు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.