ఇప్పటికే ఎక్కువ ఇచ్చాం… బాబు మాట మార్చారు!

మిత్రపక్షం తెలుగుదేశం పార్టీపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు… కేంద్రం ఇస్తున్న నిధుల విషయంలో మరోసారి టీడీపీని టార్గెట్ చేశారు. కేంద్రం ఇప్పటికే ఏపీకి ఎక్కువ నిధులిచ్చిందన్న సోము వీర్రాజు… సంతృప్తిగా ఉన్నాం, కేంద్రం అన్నీ ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు సుజనా చౌదరి అనేకసార్లు చెప్పారనే విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు బాగుందన్నవాళ్లు, ఇప్పుడు బాగోలేదని ఎందుకంటున్నారో చర్చించాలన్న వీర్రాజు… ప్రత్యేక ప్యాకేజీపై సీఎం చంద్రబాబు ఇప్పుడు మాటమారుస్తున్నారని మండిపడ్డారు.

భవనాల నిర్మాణానికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చిందన్నారు సోము వీర్రాజు… వెంకయ్యనాయుడు మరో రూ.వెయ్యి కోట్లు ఇచ్చారన్నారు. ప్రత్యేక హోదాను బిల్లులో ఐదేళ్లే అని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు వీర్రాజు. ప్రత్యేక హోదా అంటూ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని… రాజకీయ దుమారానికి మేం సమాధానమిస్తామన్నారాయన. ఐదేళ్లలో అన్నీ చేయాలని బిల్లులో కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదన్న వీర్రాజు… హామీలను నెరవేర్చడానికి 2022 వరకు సమయం ఉందన్నారు. రెవెన్యూ లోటు రూ.4600 కోట్లుగా తేలింది… కానీ, ఏపీ సర్కార్ రూ.16 వేల కోట్లు అంటోంది, రుణమాఫీ, సంక్షేమం కూడా రెవెన్యూ లోటులో చూపారన్నారు వీర్రాజు. రైల్వేజోన్, కడప్ స్టీల్ ఫ్యాక్టరీకి ఫిజిబిలిటీ లేదని కమిటీలు చెబుతున్నాయని… పోలవరం నిర్మాణానికి 100 శాతం నిధులు ఇవ్వాలని మాత్రమే చట్టంలో ఉంది… పోలవరాన్ని ఎప్పటికి కట్టాలనే కాలపరిమితి చట్టంలో లేదంటున్న సోము వీర్రాజు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి…