పిక్ టాక్‌: వాల్ పెయింటింగా? తాప్సీ నా!

అందమా అందుమా అందనంటె అందమా
చైత్రమా చేరుమా చేరనంటె న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
అందమా అందుమా అందనంటె అందమా
చైత్రమా చేరుమ్మ చేరనంటె న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ్మ
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ

ఆకలుండదే దాహముండదే ఆకతాయికోరిక కొరుక్కుతింటదే
ఆగన్నంటది దాగనంటది ఆకుచాటు వేడుక కిరుక్కుమంటది
అందమా అందుమా అందనంటె అందమా
చైత్రమా చేరుమ్మ చేరనంటె న్యాయమా…..

.. గోవిందా గోవిందా సినిమాలోనిది ఈ పాట‌. ఇదిగో ఇక్క‌డున్న బుట్ట‌బొమ్మ‌ను చూడ‌గానే సాహిత్యం ఆటోమెటిగ్గా త‌న్నుకొచ్చేస్తోంది. ప్రాణ‌మున్న ఈ బుట్ట‌బొమ్మ అందాన్ని పొగిడేందుకు వేటూరి అంత‌టి మ‌హానుభావుడు స‌మాధి నుంచి నిదుర లేవాలేమో! ఒక ర‌క‌మైన ప్రత్యేక‌త‌తో కూడుకున్న ఆ మేక‌ప్‌… ఆ డ్రెస్ డిజైనింగ్‌.. చెవుల‌కు అతికించిన ఆ పూస‌ల లోలాకు… తీర్చిదిద్దిన ఆ క‌ను రెప్ప‌లు.. దోర దోర ఆ అద‌ర తాంబూళం.. అబ్బో .. యువ‌త‌కు మ‌తి చెడ‌కుండా ఉంటుందా? లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్యారిస్ నుంచి దిగొచ్చిన రాకుమారిలా క్యాట్ వాక్ చేసింది. వీలున్న ప్ర‌తిసారీ ఇలా కొత్త‌ద‌నంతో చెల‌రేగిపోతోంది. ఆ రూపం చూస్తుంటే.. వాల్ పెయింటింగునా? అన్న సందేహం క‌లుగుతోంది. అంత‌గా తాప్సీని తీర్చిదిద్దిన డిజైన‌ర్ బృందాన్ని అభినందించాల్సిందే. తాప్సీ న‌టించిన దిల్ జంగ్లీ రిలీజ్ కి వ‌స్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లోనూ వేగం పెంచింది యూనిట్‌.