ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

జమ్మూకశ్మీర్‌లోని కరణ్ నగర్ సీఆర్పీఎఫ్‌ క్యాంపు దగ్గర అలజడి సృష్టించిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టింది ఇండియన్ ఆర్మీ… కరణ్ నగర్ క్యాంపులోకి చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదుల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించిన ఆర్మీ… నిన్న ఉదయం నుంచి 30 గంటల పాటు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగించింది. సీఆర్పీఎఫ్‌ క్యాంపులోకి చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులు… అది ఫలించకపోవడంతో పక్కనే ఉన్న భవనాల్లో నక్కి ఆర్మీపై కాల్పులు జరిపారు. దీనిపై ధీటుగా స్పందించిన ఆర్మీ… సుదీర్ఘంగా ఆపరేషన్ నిర్వహించి దాడికి యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆపరేషన్ ఫైనల్ స్టేజ్‌కి చేరిందని అధికారులు ప్రకటించారు.