ఎంపీల రాజీనామాలకు వైసీపీ నిర్ణయం

ఎపి ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా కనిగిరిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గరి ఉంది ఏపీ ఎంపీలు పార్లమెంట్ లో నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని భావించిన వైసీపీ అధినేత కేంద్రపై ఒత్తిడి పెంచేందుకు మరో అడుగు ముందుకేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రం దిగివచ్చేవరకు మార్చ్ 5 నుంచి పార్లమెంట్లో ఆందోళనలు చేస్తామన్నారు. ఈ నిరసన ప్రదర్శనలు ఏప్రిల్ 5 వరకు చేస్తాం అని ప్రకటించారు. అయినా కూడా కేంద్రం దిగిరాకుంటే ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తామని తెలిపారు జగన్. మరింత సమాచారం కోసం పైన వీడియోను క్లిక్ చేయండి.