ఖాఠ్మండు విమాన ప్రమాదం.. 50మంది మృతి..!

నేపాల్‌లోని కఠ్మాండు విమానాశ్రయంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఢాకా నుంచి అమెరికాకు బయలుదేరిన బంగ్లాదేశ్‌ విమానం కఠ్మాండు అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 50మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తుంది. ఇంకా 20 మంది ప్రయాణికులను సహాయక సిబ్బంది కాపాడి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
కాగా ఢాకా నుంచి వచ్చిన విమానం.. త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి… క్రాష్‌ ల్యాండ్‌ అయింది. దీంతో విమానంలో నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. విమానం క్రాష్‌ల్యాండ్‌ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే నేపాల్‌ ఆర్మీ రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టింది. అయితే ఇప్పటివరకు 20మంది ప్రయాణికులను కూలిన విమానం నుంచి కాపాడామని.. మరింతమందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని నేపాల్‌ ఆర్మీ వివరించింది.