ఇంకొన్ని గంట‌ల్లో ఇన్‌స్టాగ్ర‌మ్‌లోకి డ్రాకులా?

మ‌రికొన్ని గంట‌ల్లో ఫోటోషేరింగ్ సైట్ ఇన్‌స్టాగ్ర‌మ్‌లోకి ఊహించ‌ని రీతిలో ఓ డ్రాకులా చేర‌బోతోంది. ఈ డ్రాకులా ప్ర‌వేశిస్తే బిగ్ గ‌న్‌లు ఎగిరిపోవాల్సిందే.. ఇంత‌కీ ఎవ‌రీ డ్రాకులా? … ఈపాటికే అది ఎవ‌రో మీకు అర్థ‌మైంద‌నే భావించ‌వ‌చ్చు.

ఎస్‌.. మీరంతా ఊహించిన‌ట్టే మ‌రి కొన్ని గంట‌ల్లో ఇన్‌స్టాగ్ర‌మ్‌లో చేరేందుకు బాలీవుడ్ మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ సిద్ధ‌మ‌వుతున్నారు. 14 మార్చి(రేప‌టిరోజున) త‌న పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని ఇన్‌స్టాగ్ర‌మ్‌లో ప్ర‌వేశించాల‌ని అమీర్ నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే అమీర్‌కి ట్విట్ట‌ర్‌లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇన్‌స్టాగ్ర‌మ్‌లో ప్ర‌వేశించేందుకు పుట్టిన రోజు అయితేనే స‌రైన సంద‌ర్భం అని అమీర్ భావించాడ‌ట‌. అంతేకాదు.. రేపు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన త‌న త‌ల్లికి ఓ అరుదైన కానుక‌ను ఇవ్వ‌నున్నాడు. త‌న‌ అమ్మ రూపాన్ని ఓ చిత్త‌రువుగా స్కెచ్ వేసి దానిని త‌న‌కు అందిస్తాడు. బాలీవుడ్‌లో తాను గొప్ప స్టార్‌గా ఎద‌గ‌డం వెన‌క, త‌న ఈ స్థాయికి కార‌కురాలు త‌న త‌ల్లి… అందుకే త‌న‌కు అమ్మ అంటే ఎంతో ఇష్టం. త‌న‌కు ఇచ్చే కానుక అంతే ప్ర‌త్యేకంగా ఉండాల‌ని అమీర్ భావించాడ‌ట‌. అమీర్ న‌టిస్తున్న `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌` న‌వంబ‌ర్ 7న రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.