కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం

విభజన చట్టంలో హామీలపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ శాసనభ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. స్పెషల్‌ స్టేటస్‌లో ఇచ్చేవన్ని ఏపీకి ఇస్తే తప్ప.. ఆందోళన ఆగదని ఆయన ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

కాగా ప్రధాని ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని తీర్మానంలో వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలు న్యాయం కోసం పోరాడతానని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని తెలిపారు. రాజకీయాల్లో తనకు 40ఏళ్ల అనుభవం ఉందని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కు అని నొక్కి వక్కానించారు.