వీడియో: ప్రేయ‌సిని మిస్స‌యితే ఇంతటి విర‌హ‌మా?

ప్రేయ‌సిని మిస్స‌యితే ఆ విర‌హ‌వేద‌న ఎలా ఉంటుందో ఏనాడైనా అనుభ‌వించారా? అస‌లు ప్రేమిస్తే క‌దా మీకు ఆ వేద‌న తెలిసేది? పొగ‌తాగ‌నివాడు దున్న‌పోతై పుట్టును అని గిరీషం మాష్టారు ఏనాడైతే అన్నారో, ఆనాడే ప్రేమించ‌ని వారిపై ఏదో ఒక‌టి అని ఉండాల్సింది. ఇదిగో ఇక్క‌డ టైగ‌ర్ ష్రాఫ్ వేద‌న చూశాక మీక్కూడా అలానే అనిపిస్తుంది.

ప్రేమ‌.. విర‌హం.. వేద‌న .. ఆత్రం.. ఇన్ని క‌నిపిస్తున్నాయి టైగ‌ర్‌లో. త‌న‌(దిశా)ని వీడి లేదా త‌న‌కోసం వెతుకుతూ ఎంతో త‌ప‌న ప‌డుతున్న టైగ‌ర్‌ని చూస్తుంటే అయ్యో పాపం ఏ ప్రేమికుడికి ఇలాంటి ప‌రిస్థితి ఎదురు కాకూడ‌ద‌ని జాలి ప‌డ‌డం ఖాయం. `భాఘి 2` లేటెస్ట్ సాంగ్ రిలీజైంది. ఈ వీడియోలో ష్రాఫ్ అభిన‌యం యూత్‌ని క‌ట్టిప‌డేస్తోంది. హృతిక్ రోష‌న్ వార‌సుడిగా వెలిగిపోతున్న టైగ‌ర్ ష్రాఫ్ `భాఘి 2`తో మ‌రో బంప‌ర్‌హిట్ కొట్టాల‌ని కృత‌నిశ్చ‌యంతో ఉన్నాడు. అది అత‌డి క‌ళ్ల‌లో క‌నిపిస్తోంది. చిరుత‌పులిని మించిన వేగం.. ర‌బ్బ‌రులా సాగే దేహాకృతితో ఇండ‌స్ట్రీలో హీట్ పెంచుతున్నాడు టైగ‌ర్‌. `భాఘి 2` క‌థాంశం ప్రేయ‌సిని వెతుక్కుంటూ వెళ్లే ప్రియుడి క‌థ అని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మైంది. ఈ సినిమా రిలీజ్‌కి ఇంకో 17రోజులు మిగిలి ఉంది. మార్చి 30న రామ్‌చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం`తో పాటే పోటీప‌డుతోంది ఈ చిత్రం. టిల్ దెన్ వెయిట్ అండ్ వాచ్‌…దిస్ స్పేస్ ఫ‌ర్ మోర్ డీటెయిల్స్.