గాయ‌కుడు ఉదిత్ నారాయ‌ణ్ కుమారుడు అరెస్ట్‌

మేటి గాయ‌కుడు ఉదిత్ నారాయ‌ణ్ కుమారుడు ఆదిత్య నారాయ‌ణ్ ని ముంబై – వెర్సోవా పోలీసులు అరెస్టు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. ఆదిత్య కార్ ఓ ఆటోరిక్షాని ఢీకొట్టింది. ఆ క్ర‌మంలోనే ఆటో అందులో ప‌య‌నిస్తున్న ఓ ఆడ‌మ‌నిషికి గాయాల‌య్యాయి. ర్యాష్ డ్రైవింగ్‌తోనే ఈ యాక్సిడెంట్ అయ్యింద‌ని డిక్లేర్ చేసిన పోలీసులు స‌ద‌రు యువ‌గాయ‌కుడిని అరెస్టు చేశారు. అటుపై బెయిల్‌, పూచీక‌త్తుపై విడుద‌ల చేశారు.

ఆదిత్య నారాయ‌ణ్ చ‌క్క‌ని ప్ర‌తిభావంతుడు. బాల‌కుడిగానే 100 పైగా పాట‌లు పాడిన ట్యాలెంటెడ్ గ‌య్‌. న‌వ‌త‌రం గాయ‌కుడిగా దూసుకుపోతున్న ఆదిత్య‌కు దూకుడెక్కువేన‌నేందుకు ప‌లు ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ఇదివ‌ర‌కూ ఓ సారి విమానాశ్ర‌యంలో సిబ్బందిపై చెయ్యి చేసుకున్నాడు. ఒక‌ని బ‌ట్ట‌లు ఊడ‌దీసి త‌న్నిన వీడియో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. అయితే ఫేజ్ -3 పుత్ర‌ర‌త్నాల దూకుడు ఇలా రాంగ్ రీజన్స్‌తో హెడ్‌లైన్స్‌లోకి రావ‌డం ఇబ్బందిక‌ర ప‌రిణామం.