నిర్ణయం కఠినమే… కానీ, తప్పదు-కేసీఆర్

నిర్ణయం కఠినమే… కానీ, తప్పదు అని వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు… ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సభ్యత్వాలు రద్దు, 11 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసిన ఘటనపై అసెంబ్లీ వేదికగా స్పందించిన కేసీఆర్… మండలి చైర్మన్‌పై దాడిని ఖండించారు. ఇలాంటి పరిస్థితులు మన శాసనసభలో వస్తాయని ఊహించలేదన్న సీఎం… కాంగ్రెస్ నేతలకు ఇంత అసహన వైఖరి సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు సభ లోపల, బయట ప్రవర్తిస్తున్న తీరు సిగ్గు చేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్.

మేం దాడి చేద్దామనుకున్నది గవర్నర్‌పై కానీ, పొరపాటున స్వామిగౌడ్‌కి తగిలిందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్న సీఎం కేసీఆర్… నాలుగేళ్లుగా తనపై కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేస్తున్నారని… ఇంత రాజకీయ అసహనం పనికిరాదన్నారు. అరాచశక్తుల పీచమణచడంలో ప్రభుత్వం దేనికైనా వెనకాడన్న తెలంగాణ ముఖ్యమంత్రి… రాజకీయ నేతల ముసుగులో అరాచకాలు సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏ ఎన్నికల్లో గెలవలేదని… ప్రజలు తిరస్కరిస్తూ ఉంటే… ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ మండిపడ్డ కేసీఆర్… అసెంబ్లీలో ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి…