కాంగ్రెస్ ఎమ్మెల్సీలపైనా వేటు…

అసెంబ్లీలో నిన్న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసంహిన్ ప్రసంగిస్తున్న సందర్భంలో చోటుచేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌ సభ్యత్వాన్ని రద్దు చేయడం, సీఎల్పీ నేత జానారెడ్డి సహా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలను బడ్జెట్ సమావేశాల వరకు సభ నుంచి సస్పెండ్ చేయడం జరిగిపోయాయి. అయితే శాసన మండలిలోనూ ఇలాంటి చర్యలకే పూనుకుంది తెలంగాణ ప్రభుత్వం.

డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు అధ్యక్షతన మండలి ప్రారంభం కాగానే… నిన్న గవర్నర్ ప్రసంగం సమయంలో అనుచితంగా ప్రవర్తించిన మండలి కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్ష్ తీర్మానం ప్రవేశపెట్టారు మండలి సభానాయకుడు కడియం శ్రీహరి. దీనికి మండలి ఆమోదం తెలిపింది… దీంతో మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ సహా కాంగ్రెస్ శాసన మండలి సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. బడ్జెట్ సమావేశాల సెషన్ మొత్తం ఈ సస్పెన్షన్ కొనసాగనుంది.