సౌత్‌లో కాస్టింగ్‌కౌచ్‌పై నోరు జారిన ఇలియానా!

సౌత్ ఫిలింఇండ‌స్ట్రీపై వీలున్న‌ప్పుడ‌ల్లా ఓ రాయి విసురుతోంది ఇలియాన‌. క్యాచ్ మి ప్లీజ్‌! అంటూ ఇటువైపు అంత కోపంగా విసుర్లు విస‌ర‌డం వెన‌క అర్థం ఏం ఉన్నా.. దానిని మ‌న‌వాళ్లు సౌఖ్యంగానే భ‌రిస్తున్నారు. ప‌్ర‌స్తుతం సంద‌ర్భం కాని సంద‌ర్భం .. అసంద‌ర్భ‌మే అయినా.. ఇలియానా మ‌రోసారి సౌత్ ఇండ‌స్ట్రీపై త‌న అక్క‌సును వెల్ల‌గ‌క్క‌డం టాలీవుడ్‌లో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. జ‌మానా కాలంలో ఓ జూనియ‌ర్ ఆర్టిస్టును ఓ నిర్మాత `ప‌డ‌క సుఖం` గురించి అడిగాడ‌ని లేటెస్టుగా ఇలియానా వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌న‌మైంది.

అయితే ఆ స‌న్నివేశం ఎదురైన‌ప్పుడు స‌ద‌రు జూ.ఆర్టిస్టు త‌న‌ని క‌లిసి స‌ల‌హా అడిగిందిట‌. అలాంటి సంద‌ర్భంలో ఎలా స్పందించాలో త‌న‌కు అర్థం కాలేద‌ని ఇలియానా అంది. “క‌మిట్‌మెంట్ అనేది నీ ఇష్టం.. ఇలాంటివి ఎవ‌రికి వారు నిర్ణ‌యించుకోవాల్సిన‌వి అని చెప్పాను“ అని తెలిపింది. అలాంటివాటిపై పెద‌వి మెదిపితే ఇక అంతే సంగ‌తి. ఆ త‌ర్వాత అవ‌కాశాలుండ‌వ్‌!! అంటూ గుంభ‌న‌గా వ్యాఖ్యానించింది. అందుకు స‌ద‌రు జూ.ఆర్టిస్టునే ఎగ్జాంపుల్ అని తెలిపింది. అయితే ఈ త‌ర‌హా వేదింపులు, క‌మిట్‌మెంట్‌లు స‌మ‌ర్థ‌నీయం కాద‌ని ఇలియానా ఖండించింది. కెవిన్ స్పేసీ లాంటి గొప్ప న‌టుడి షోలు చూడ‌డం మానేశాను.. ఎందుకంటే అత‌డు కూడా వేదింపుల‌కు పాల్ప‌డ్డాడు కాబ‌ట్టి..! అంటూ ట్విస్టిచ్చింది. ఇక ఇలియానా మాట అటుంచితే, టాలీవుడ్‌కి చెందిన ఓ యువ‌క‌థానాయిక కం యాంక‌ర్‌ తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ లైవ్‌లో త‌న‌కు ఎదురైన అనుభ‌వాల్ని పూస‌గుచ్చి ఆవేద‌న వెల్ల‌గ‌క్క‌డం చ‌ర్చ‌కొచ్చింది. క‌థానాయిక‌లు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, కెమెరామెన్‌ల‌తో క‌మిట‌వ్వాల్సిందిగా డైరెక్టుగానే అడిగేస్తార‌ని, అస‌లు తెలుగ‌మ్మాయిల‌కు అవ‌కాశాలే ఇవ్వ‌ర‌ని స‌ద‌రు క‌థానాయిక వాపోయింది. పైకి ఒక‌టి మాట్లాడే పెద్ద‌లు, లోన ఇంకోలా ఉంటార‌ని బ‌హిరంగంగానే ఆవేద‌న వెల్ల‌గ‌క్క‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌కొచ్చింది.