శ్రీలంకపై ప్రతీకారం తీర్చుకున్న భారత్…

ట్రైసిరీస్‌లో శ్రీలంకపై రివేంజ్ తీర్చుకుంది టీమిండియా… మొదటి మ్యాచ్ ఓటమికి తిరుగులేని సమాధానం చెప్పింది. కొలంబో వేదికగా జరిగిన టీ-19 మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. భారత బౌలర్ శార్దూల్ ఠాకూర్ లంక బ్యాట్స్‌మన్స్‌కు చుక్కలు చూపించాడు. ఈ విక్టరీతో ట్రై సిరీస్ పాయింట్ల పట్టికలో భారత్ టాప్ ప్లేస్‌కి చేరుకుంది.

ముక్కోణపు సిరీస్‌లో భారత్‌కు రెండో విజయం… శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు, బ్యాట్స్‌మన్లు సమిష్టిగా రాణించి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. వర్షం అడ్డుపడడంతో 20-20 మ్యాచ్‌ని 19 ఓవర్లకే కుదించారు. ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లంక స్కోర్ బోర్డు పెరగకుండా బౌలర్ శార్దూల్ ఠాకూర్ అడుగడునా అడ్డుకున్నాడు. 27 పరుగలకే 4 వికెట్లు పడగొంట్టి లంక బ్యాట్స్‌మన్లను డిఫెన్స్‌లో పడేశాడు. శార్దూల్‌కు తోడుగా సుందర్ 2, కేదార్ జాదవ్, చాహల్, విజయ్ శంకర్ తలో వికెట్ తీశారు. భారత బౌలర్ల దాటికి లంక బ్యాట్స్‌మన్లు చేతులెత్తేశారు. ఇక 153 పరుగుల లక్ష్యంతో క్రీజ్‌లోకి అడుగుపెట్టిన భారత్… 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ నిరాశపర్చినా ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్లు కాస్త నిలకడగా ఆడి… మ్యాచ్ చేజారకుండా కాస్త జాగ్రత్తపడ్డారు. లోకేష్ రాహుల్ 18, సురేష్ రైనా 27 పరుగులు చేశారు. మనీష్ పాండే, దినేష్ కార్తీక్ జోడీ 68 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను పూర్తిగా కంట్రోల్‌లో పెట్టేశారు. దినేష్ కార్తీక్ 39 పరుగులు జోడించడంతో మ్యాచ్ గెలుపు సులభమైంది. లంక బౌలర్లతో ఓ ఆటాడుకున్న శార్దూల్ ఠాకూర్… మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రేపు రాత్రి భారత్‌తో తలపడనుంది బంగ్లాదేశ్…