నాపై దాడి జరిగితే ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావం..!

గుంటూరులోని నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా… 35 ఎకరాల విస్తీర్ణంలో రేపు జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ జరుగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీ డీజీపీకి లేఖ రాశారు. జనసేన ఆవిర్భావ సభకు భద్రత అందిస్తున్నందుకు కృతజ్ఞతలని వెల్లడించారు.

అయితే.. తనపై దాడి జరిగితే ప్రజా జీవితంపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించారు. గతంలో భీమవరంలో ఫ్లెక్సీ చింపేసినందుకే అభిమానులు ధర్నా చేశారని ఈ సందర్భంగా లేఖలో వెల్లడించారు. ఈ మధ్య అనంతపురం పర్యటనలో తొక్కిసలాట ఘటన దృష్ట్యా భ్రదత కోరుతున్నానని పేర్కొన్నారు. భద్రతకు పోలీసులు నిస్సహాయత ప్రకటిస్తే ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్నారు.