తనపై చేసిన వ్యాఖ్యలపై జయాబచ్చన్‌ స్పందన

సమాజ్ వాదీ పార్టీ నుంచి తనను కాదని జయాబచ్చన్ కు రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై ఈ మధ్య నరేశ్ అగర్వాల్ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సినిమాల్లో డాన్సులు చేసే వాళ్లకు టిక్కెట్ ఇవ్వడం సిగ్గుచేటని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కాగా నరేశ్ అగర్వాల్ వ్యాఖ్యలపై జయా బచ్చన్ స్పందించారు. తాను చాలా మొండి మనిషినని, ఇలాంటి వాటికి తాను సమాధానం ఇవ్వనని అన్నారు. కానీ… నరేశ్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.