కేజ్రీవాల్‌ సలహాదారు రాజీనామా..!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మరో షాక్‌. ఆయన వ్యక్తిగత సలహాదారుడు అయిన వీకే జైన్‌ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం జైన్‌ తన రాజీనామా లేఖను సీఎంవో కార్యాలయానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయానికి పంపారు.

కాగా వ్యక్తిగత కారణాల కారణంగా తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తన రాజీనామ లేఖలో ఆయన పేర్కొన్నారు. కానీ… ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీ అన్షు ప్రకాశ్‌పై దాడి కేసులో జైన్‌ సాక్షిగా ఉండటంతో ఆయన రాజీనామా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అలాగే.. రెండురోజుల క్రితమే జైన్‌ను సీఎస్‌ దాడి వ్యవహారంలో పోలీసులు విచారించారు. గతనెల 22వ తేదీన ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ అన్షు పై ఆప్‌ ఎమ్మెల్యేలు అమానుతుల్లా ఖాన్‌, ప్రకాశ్‌ జార్వల్‌ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని.. ఎమెల్యేలు దాడి చేయటం చూశానని విచారణలో జైన్‌ తెలిపినట్లు సమాచారం.