రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రత్యేక హోదా ఉద్యమం..!

ఆధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉందని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. అందుకే ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అన్ని పార్టీలు తెరపైకి తెచ్చాయని విమర్శించారు. తాజాగా ఎన్ టీవీ ఎక్స్ క్లూజివ్ లో ఆమె మాట్లాడుతూ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు.

అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పిందని.. అయినప్పటికీ రాజకీయపార్టీలు పోరాడుతున్నాయని విమర్శించారు. హోదా కోసం పోరాడుతున్న చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారో చెప్పాలని ఆమె మండిపడ్డారు. కేవలం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు స్వప్రయోజనాల కోసం ‘ప్రత్యేక హోదా’ను తమ అజెండాగా మలుచుకుంటున్నాయని తెలిపారు. ఇంకా కొత్తపల్లి గీత ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే పై వీడియోను క్లిక్ చేయండి.