నెక్ట్స్ `సూ`స‌్టార్‌: దూసుకొస్తున్న కింగ్‌ఖాన్ వార‌సురాలు?

సుహానా సునామీ సైలెంటుగా దూసుకొస్తోంది.. ఏ క్ష‌ణాన అయినా అది తీరాన్ని తాకొచ్చు… ద‌ట్ మీన్స్‌.. ఏ క్ష‌ణాన అయినా కింగ్‌ఖాన్ వార‌సురాలి డెబ్యూ మూవీ గురించిన అధికారిక వార్త అందే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే మామ్ గౌరీఖాన్ నుంచి, డాడ్ కింగ్ ఖాన్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్‌ అందుకుంది. సుహానా గొప్ప స్టార్ అవ్వాల‌నుకుంటోంది. త‌ను ఏం అవ్వాల‌నుకుంటే అది అవ్వ‌మ‌ని చెప్పాను. అయితే అంత‌కంటే ముందే చ‌దువు పూర్తి చేయ‌మ‌ని సూచించాన‌ని ఇదివ‌ర‌కూ `జ‌బ్ హ్యారీ మెట్ సీజ‌ల్‌` ప్ర‌మోష‌న్స్‌లో షారూక్ వెల్ల‌డించారు.

తాజా అప్‌డేట్ ప్రకారం.. సుహానా బాలీవుడ్ ఎంట్రీ ఇంకెంతో దూరం లేదు. ఏ క్ష‌ణం అయినా త‌న డెబ్యూ ప్రాజెక్టును ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని మామ్ గౌరీఖాన్ నుంచి ఓ లీకేజీ అందింది. త్వ‌ర‌లోనే ఓ ప్ర‌ఖ్యాత మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీ పై సుహానా ద‌ర్శ‌న‌మీయ‌నుంది. అయితే ఆ మ్యాగ‌జైన్ ఏది అనేది ఇప్పుడే చెప్ప‌న‌ని గౌరీఖాన్ లీక్ ఇవ్వ‌డం బాలీవుడ్ స‌హా స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ అయ్యింది. ఆ మ్యాగ‌జైన్ ఏది? అనేది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్‌. క‌చ్ఛితంగా అందులో రాసే క‌వ‌ర్‌స్టోరీలో సుహానా డెబ్యూకి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించే ఆస్కారం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. సోనాక్షి, సోన‌మ్, జాన్వీ క‌పూర్‌, అహ‌నా పాండే, సారా అలీఖాన్ త‌ర‌హాలోనే కింగ్ ఖాన్ న‌ట‌వార‌సురాలి ఎంట్రీ అంతే ఘ‌నంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. జ‌స్ట్ వెయిట్‌.. టు క్యాచ్ సుహానా గ్లింప్స్‌..