కేంద్రంపై వైకాపా అవిశ్వాసానికి తెదేపా మద్దతివ్వాలి…!

రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని… పార్టీ మారిన 22 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇవ్వడం తెదేపాకు చెంపపెట్టులాంటిదని వైకాపా నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. తాజాగా ఆయన మీజియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది టీడీపీకి చెంపపెట్టు లాంటిదని, కోర్టు తీర్పు రాక ముందే వారితో రాజీనామా చేయించి రాజకీయ విలువలు కాపాడాలని చంద్రబాబుకు హెచ్చరించారు.

ఇంకా ప్రత్యేక హోదాకై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు ఇవ్వాలని హితవు పలికారు. అవిశ్వాసానికి అన్ని పార్టీల మద్దతు కూడగడతామని ఈ సందర్భంగా బొత్స పేర్కొన్నారు. కాగా ఇంకా బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే పై వీడియోను క్లిక్ చేయండి.