కోదండరామ్ సభకు అనుమతివ్వండి…!

ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో టీజేఎస్ వ్యవస్థాపకుడు కోదండరామ్, పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే… ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో టీజేఎస్ ఆవిర్భావ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని.. మూడు రోజుల్లోగా అనుమతులు మంజూరు చేయాలని హైకోర్ట్ ఆదేశించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో టీజేఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే… హైదరాబాద్ నగరంలో టీజేఎస్ పార్టీ ఆవిర్భావ సభ పెడితే అక్కడికి వచ్చే వాహనాల పొగ కారణంగా కాలుష్యం పెరుగుతుందని… ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని.. ఆ కారణంగానే సభకు అనుమతివ్వడం లేదని పోలీస్ శాఖ ఈ మధ్య వివరించిన విషయం కూడా విదితమే.