వైసీపీ నుంచి బయటకు రావడానికి అపార్థాలే కారణం..!

ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లా ఎంపీ బుట్టా రేణుక తాజాగా ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికరమైన రాజకీయ విషయాలు ప్రస్తావించారు. అయితే వైకాపా నుండి ఎంపీగా ఎన్నికై ఆ తర్వాత తెదేపాలో చేరిన బుట్టా రేణుక మాట్లాడుతూ… ముందుగా ఈ పరిణామాలను ఊహించుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిపారు. అలాగే.. తాను ప్రధానంగా పార్టీ మారడానికి పార్టీ సిద్ధాంతాలు… వ్యక్తిగతమైన విషయాలు కారణంగా పరిస్థితులు రావడంతో అలా చేశానని తెలిపారు.

కాగా తాను ప్రత్యేక హోదా కోసం తెదేపా వారితో కలిసి నిరసన తెలిపారని అన్నారు. ఇంకా తెదేపాలో రావడానికి ప్రధాన కారణం మిస్ అండర్ స్టాండింగ్ వల్లనే అని ఆమె అన్నారు. ఇంకా బుట్టా రేణుక ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే పై వీడియోను క్లిక్ చేయండి.