నా పేరు సూర్యకి గెస్ట్స్ లేనట్టేనా

స్టైలిష్ అల్లు అర్జున్ తాజాగా నటించిన చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రీసెంట్ గానే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మే 4న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో విరివిగా ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టారు చిత్రబృందం. ఇదే క్రమంలో ఈనెల 29న హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని ప్లాన్ చేశారు.

ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదట్లో ఈ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రచారం జరిగింది. కనై తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ టైంలో సైరా షూటింగ్ లో బిజీ కానుండడంతో హాజరుకాకపోవచ్చని, అందుకే నిన్ననే నాపేరు సూర్య సెట్స్ కి వెళ్లి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సో చిరు ఇక రావడం కష్టమే అని తేలిపోయింది. మరోవైపు బన్నీకి మంచి మిత్రుడైన ప్రభాస్ హాజరవుతారని కొద్ది రోజులుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. కానీ ఆ డేట్ కి సాహో దుబాయ్ షెడ్యూల్లో బిజీగా ఉంటారు. సో ఒక్క రోజు ఈవెంట్ కు దుబాయ్ నుండి హైదరాబాద్ కి రావడం అంటే చాలా కష్టమైన పని. చూస్తుంటే ఈ ఈవెంట్ కి ఎవరు హాజరవుతారో అనే ప్రశ్న బన్నీ అభిమానులను కాస్త టెన్షన్ కి గురి చేస్తోంది.