టీటీడీ చైర్మన్ కు మద్దతుగా యాదవులు శైవాలయం ముట్టడి..!

గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ నియామకం వివాదంగా మారుతుంది. పుట్టా సుధాకర్ హిందువే కాదంటూ స్వామీజీలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో అటు యాదవ సంఘాలు స్వామీజీలపై ఆందోళనలు చేస్తున్నారు.

ముఖ్యంగా శివస్వామి పుట్టా సుధాకర్ కు కాకుండా ఆ పదవిని ఎవరికి ఇచ్చినా పర్వలేదని వెల్లడించిన విషయం తెలిసిందే. అందుకు నిరసనగా యాదవ సంఘాలు తాళ్లాయపాలెంలోని శైవ క్షేత్రాన్ని ముట్టడించారు. తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శైవ స్వామి వ్యాఖ్యలకు నిరసనగా యాదవులు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ఈ ఘటనపై మరింత సమాచారం కోసం పై వీడియోను క్లిక్ చేయండి.