మ‌ళ్లీ టాలీవుడ్‌లో స‌న్నీ వైర‌స్‌?

ఉత్త‌రాది, ద‌క్షిణాది అనే తేడా లేకుండా అవ‌కాశాలొస్తే ఎక్క‌డైనా న‌టించేందుకు సై అంటోంది స‌న్నీలియోన్‌. ఆ క్ర‌మంలోనే ద‌క్షిణాదిన ఈ భామ ఓ హిస్టారిక‌ల్ వారియ‌ర్ డ్రామాలో న‌టించే అవ‌కాశం అందుకుంది. ద‌క్షిణ భార‌త‌దేశానికి చెందిన ధీర‌వ‌నిత జీవిత‌క‌థాంశ‌మిద‌ని ప్ర‌చార‌మైంది. సినిమా టైటిల్ `వీర‌మాదేవి`. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ర‌ఘురాజ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ రివెంజ్ డ్రామా కోసం స‌న్నీలియోన్ ఇప్ప‌టికే క‌త్తి యుద్ధాలు, గుర్ర‌పుస్వారీ వంటివి నేర్చుకుందిట‌.

సినిమా ప్రారంభించ‌డానికి ఇంకెంతో స‌మ‌యం లేదు. `వీర‌మాదేవి` ఈ నెలాఖ‌రు నుంచి సెట్స్‌పైకి వెళ్ల‌నుంద‌ని తాజాగా అప్‌డేట్ అందింది. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క బ‌హుభాషా చిత్రాన్ని `సింగం-3` స‌మ‌ర్ప‌కుడు మ‌ల్కాపురం శివ‌కుమార్ తెలుగులో రిలీజ్ చేయ‌నున్నారు. చిత్రీక‌ర‌ణ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసి ఏడాది చివ‌రిలో రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది.