వైసీపీ ఫేక్ పార్టీ అన్న బాబు వ్యాఖ్యలపై వైసీపీ స్పందన…

వైసీపీ ఫేక్ పార్టీ… ఫేక్ ఫొటోలు, ఫేక్ వీడియోలతో ఫేక్ రాజకీయం చేస్తుందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే… అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై అంతే సీరియస్‌గా స్పందించారు వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు… చంద్రబాబు ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప అందులో పసలేదన్నారు. చంద్రబాబు… వైసీపీని నమ్మొద్దంటే వినే స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు లేరన్న ఉమ్మారెడ్డి… ఎవ్వరిని నమ్మాలో! ఎవ్వరిని నమ్మకూడదో! జనానికి తెలుసన్నారు. ప్రత్యేక హోదా కోసం యూ టర్న్ తీసుకున్నదెవరో కూడా ప్రజలకు తెలుసంటూ ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబు కేసులు పెట్టిన వెనక్కి తగ్గకుండా ప్రజలంతా బంద్‌లో పాల్గొని విజయవంతం చేశారన్నారు ఉమ్మారెడ్డి.

ఏపీలో బంద్ విజయవంతమైందన్నారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు… రాష్ట్ర బంద్‌లో అన్ని పార్టీలు పాల్గొన్నాయని… కానీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పాల్గొనలేదన్న ఉమ్మారెడ్డి… టీడీపీ రాష్ట్ర ప్రజల మనోగతనికి వ్యతిరేకంగా పని చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్‌లో అవిశ్వాసం పెడితే దానిని చర్చకు రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు… వైసీపీ ఎంపీలు దీక్ష చేస్తే ఏపీ ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా వచ్చి పరామర్శించలేదన్నారు.