విజయ్ దేవరకొండ టీజర్ వాయిదా

విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం టాక్సీ వాలా. నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ నేతృత్వంలో ఈ సినిమా రూపొందింది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మే 18న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా ముమ్మరంగా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ఈనెల 17న టీజర్ ని రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.

కానీ తాజాగా ఈ డేట్ ను మారుస్తూ 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. సైంటిఫిక్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా రూపొందడం విశేషం. విజయ్ ఇందులో టాక్సీ డ్రైవర్ గా రఫ్ లుక్ లో మాస్సిగా కనిపించనున్నాడు. ఇదివరకే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో ప్రియాంక జవల్కర్, మాళవిక శర్మలు హీరోయిన్స్ గా నటించారు. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రం కావడంతో ట్రేడ్ మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుజిత్ సారంగ్ కెమెరాను హ్యాండిల్ చేయగా, జాక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. ఈ ఎంటర్ టైనర్ ను గీత ఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.