సల్మాన్ ఖాన్‌కు ఊరట…

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు కోర్టులో ఊరట లభించింది… కృష్ణ జింకల వేట కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడ్డ సల్మాన్ ఖాన్‌కు రూ.50 వేల పూచీక‌త్తుతో బెయిల్ మంజూరు చేసింది… రెండు రోజులు జైలు జీవితం గ‌డిపిన త‌ర్వాత బెయిల్‌తో స‌ల్మాన్ బ‌య‌ట‌కి వ‌చ్చారు. కాగా, విదేశాలకు వెళ్లడానికి అనుమతి కోరుతూ సల్మాన్ పిటిషన్ దాఖలు చేశారు… దీనిపై విచారణ జరిపిన జోధ్‌పూర్ కోర్టు సల్మాన్‌కు నాలుగు దేశాల‌ను విజిటే చేసే అవకాశం కలిపించింది.

1998లో కృష్ణజింకను వేటాడిన కేసులో స‌ల్మాన్‌ని దోషిగా తేల్చిన జోద్‌పూర్ కోర్టు… రెండు రోజుల తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో పాటు భారత్ దాటి బయలకు వెళ్లకూడదనే షరతులు పెట్టింది. కాగా, తాజా తీర్పుతో సల్మాన్‌ ఖాన్ నాలుగు దేశాల్లో పర్యటించేందుకు అవకాశం కల్పించింది. మే 25 నుండి జులై 10వ తేదీ వ‌ర‌కు స‌ల్మాన్… కెన‌డా, నేపాల్ , యూఎస్ఏలో ప‌ర్య‌టిచ‌నున్నాడు. రెమా డిసౌజా ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న రేస్ 3 మూవీకి సంబంధించిన సాంగ్ బ్యాలెన్స్ ఉండగా… ఇది విదేశాలలో షూట్ చేయనున్నారు.