గాజువాక సబ్‌ రిజిస్ట్రార్‌ ఆస్తులపై ఏసీబీ దాడులు…

గాజువాక సబ్‌రిజిస్ట్రార్‌ వెంకయ్యనాయుడు ఇంట్లో ఏసీబీ అధికారులు ఈ ఉదయం నుండి సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనకు చెందిన ఆస్తులపై విశాఖ, తిరుపతిలోని ఆరు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. అయితే ఆయనపై ఏసీబీ రైడింగ్‌ ఇది తొలిసారి కాదు, గతంలో మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్న సమయంలో కూడా వెంకయ్య నాయుడు ఆస్తులపై ఏసీబీ దాడులు చేసింది. ఇక గత మూడేళ్లుగా గాజువాక సబ్‌రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తుండగా, మరోసారి సోదాలు నిర్వహించారు అధికారులు.