ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

తాడికొండ
తాడికొండ

2014 సాధారణ ఎన్నికలలో తాడికొండ రిజర్వుడ్ శాసనసభ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధి టి.శ్రావణకుమార్ గెలిచారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి క్రిస్టినా కన్నా 7542 ఓట్లు ఎక్కువ తెచ్చుకుని విజయం సాధించారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ 2014 ఎన్నికలలో పోటీ చేయలేదు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కిశోర్ శేఖర్ కు 2191 ఓట్లు మాత్రమే వచ్చాయి. డొక్కా మాణిక్య వరప్రసాద్ రెండుసార్లు గెలిచి వైఎస్, రోశయ్య,కిరణ్ మంత్రివర్గాలలో పని చేశారు. 
తాడికొండ నియోజకవర్గానికి 11సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు, సిపిఐ ఒకసారి గెలిచాయి. ఈ నియోజకవర్గం జనరల్ గా ఉన్నప్పుడు రెండుసార్లు గెలిచిన జివి.రత్తయ్య, మంగళగిరిలో మరోసారి విజయం సాధించారు. టిడిపి నేత జెఆర్.పుష్పరాజ్ మూడుసార్లు గెలిచారు. ఆయన గతంలో ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. 

Activities are not Found
No results found.