ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు
కర్నూలు

2014 సాధారణ ఎన్నికలలో కర్నూలు శాసనసభ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి ఎస్వీ మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఆయన మాజీ మంత్రి, టిడిపి ప్రత్యర్ధి టిజి.వెంకటేష్ పై 3479 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ తరపున గెలిచి , కిరణ్ కుమారెడ్డి క్యాబినెట్ లో పని చేసిన టిజి,తెలంగాణ ఏర్పాటు నేపధ్యంలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. 2014 ఎన్నికల ముందు టిడిపిలో చేరి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అహ్మద్ అలీ ఖాన్ కు 16120 ఓట్లు రావడం విశేషం. మాజీ ఎమ్మెల్యే, సిపిఎం నేత గపూర్ కు 6159 ఓట్లు వచ్చాయి. అయితే తర్వాత జరిగిన పరిణామాల కారణంగా ఎస్వీ మోహన్ రెడ్డి వైసిపిని వీడి.. టిడిపిలో చేరిపోయారు. 
కర్నూలుకు 14సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ ఎనిమిదిసార్లు, టిడిపి రెండుసార్లు, సిపిఎం రెండుసార్లు, వైసిపి ఒకసారి గెలుపొందాయి. ఇండిపెండెంటు ఒకరు కూడా గెలిచారు. 1955లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు రెండుసీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. 1952లో ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గెలిచారు. ఆయన ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి క్యాబినెట్ లో పని చేశారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం రాజ్యసభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. ఏఐసిసి అధ్యక్షునిగా కూడా సంజీవయ్య సేవలందించారు. సంజీవయ్య భార్య కృష్ణవేణి ఎమ్మెల్సీగా, కొద్దికాలం మంత్రిగా వ్యవహరించారు. సంజీవయ్య సోదరుని కుమారుడు మునుస్వామి కూడా ఎమ్మెల్యేగా , మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక్కడ కే.ఇ.మాదన్న ఒకసారి గెలవగా, ఆయన కుమారులు కె.ఇ.కృష్ణమూర్తి డోన్ లో ఐదుసార్లు, కె.ఇ.ప్రభాకర్ డోన్, పత్తికొండలలో మూడుసార్లు గెలిచారు. వి.రాంభూపాల్ చౌదరి కర్నూలులో ఒకసారి టిడిపి తరపున , రెండుసార్లు కాంగ్రెస్ తరపున గెలుపొందారు. రాంభూపాల్ చౌదరి నాదెండ్ల నెలరోజుల క్యాబినెట్ లోను, కోట్ల క్యాబినెట్ లోను పని చేశారు. కర్నూలులో నలుగురు మైనార్టీ నేతలు ఎం.ఎ.ఖాన్, రహ్మాన్ ఖాన్, ఇబ్రహీంఖాన్, గపూర్ లు విజయం సాధించారు. 

Activities are not Found
No results found.