తెలంగాణ - CLICK HERE

ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం

 

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,50,291 అందులో పురుషులు -1,28,345  మహిళలు - 1,21,925, థర్డ్ జెండర్  21మంది ఉన్నారు.  

2018 అసెంబ్లీ ఎన్నికలకు  టిఆర్ఎస్ నుండి తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నారు. 

టీడీపీ, బీజేపీ కూటమితో రంగారెడ్డి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో ఏడు స్ధానాలను దక్కించుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆ కూటమి నుంచి బరిలోకి దిగిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రెండో సారి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ రెబెల్ నాయకుడు ఎం. రామ్ రెడ్డిపై 11 వేల మెజార్టీతో గెలిచారు. గత ఎన్నికల్లో ప్రముఖ విద్యావేత్త, సినినటుడు అల్లు అర్జున్ మామ అయిన చంద్రశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు 21,779 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ధి మల్లేష్ కు 36,865 ఓట్లు, సీపీఎం అభ్యర్ధి యాదయ్యకు 14,902 ఓట్లు, వైసీపీ అభ్యర్ధి శేఖర్ గౌడ్ కు 10,884 ఓట్లు వచ్చాయి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా నాలుగుసార్లు రెడ్డి సామాజిక వర్గం నేతలు, మూడు సార్లు బీసీలకు చెందిన నేతలు గెలుపొందారు. 1952 నుంచి 1972 వరకు జనరల్ గా, 1978 నుంచి 2004 వరకు రిజర్వ్ డ్ గా ఉంది. తిరిగి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం 2009లో జనరల్ గా మారింది. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఎనిమిది సార్లు, టీడీపీ నాలుగు సార్లు, సీపీఎం మూడు సార్లు, పీడీఎఫ్ ఒక్కసారి గెలిచింది.

 

Activities are not Found
No results found.