తెలంగాణ

కరీంనగర్
కరీంనగర్

2009లో టిడిపి తరపున గెలిచిన గంగుల కమలాకర్ 2014లో టిఆర్ఎస్ తరపున గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికలలో ఆ పార్టీ తరపున పోటీ చేసి బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధి బండి సంజయ్ పై 24754 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సి.లక్ష్మీనరసింహారావు 51339 ఓట్లు వచ్చాయి.
1952 నుంచి 14సార్లు కరీంనగర్ స్థానానికి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ కలిసి ఐదుసార్లు గెలిచాయి. టిడిపి ఐదుసార్లు గెలిచింది. పిడిఎఫ్ , సోషలిస్టులు, టిఆర్ఎస్ ఒక్కోసారి, ఇండిపెండెంట్లు మరోసారి గెలిచారు. 
1983 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఒకే ఒక్కసారి 2004లో మాత్రమే గెలిచింది. సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు గెలిచారు. 
1989లో ఇక్కడ ఇండిపెండెంటుగా గెలిచిన వి.జగపతిరావు 1972లో జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొందారు. దివంగత నేత జువ్వాది చొక్కారావు మూడుసార్లు ఇక్కడ నుంచి అసెంబ్లీకి, మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఎం.సత్యనారాయణరావు కూడా మూడుసార్లు లోక్ సభకు గెలుపొందారు. 

ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను రంగంలోకి దింపింది టిఆర్ఎస్ 

Activities are not Found
No results found.