తెలంగాణ

కొడంగల్
కొడంగల్

2014 సాధారణ ఎన్నికలో టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంల మరోసారి విజయఢంకా మోగించారు.ఈసారి కూడా ఆయన సీనియర్ నేత గురునాథరెడ్డిని 14614 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. కాకపోతే కిందటిసారి గురునాధరెద్ది కాంగ్రెస్ అభ్యర్ధిగా రంగంలో దిగితే ఈసారి టిఆర్ఎస్ లో చేరి పోటీ చేశారు. అయినా ఫలితం దక్కలేదు. కొడంగల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మాజీ ఎంపి విఠల్ రావు 36304 ఓట్లు తెచ్చుకుని మూడో స్ధానానికే పరిమితమయ్యారు. 
రేవంత్ రెడ్డి ఒకసారి శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండుసార్లు శాసనసభకు గెలిచారు.  కొడంగల్ లో గురునాథరెడ్డి ఐదుసార్లు 1978,1983,1989,1999,2004లలో గెలుపొందారు.  
ఒక ఉప ఎన్నికతో సహా 15సార్లు ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఎనిమిదిసార్లు గెలిచాయి. టిడిపి ఐదుసార్లు, స్వతంత్రపార్టీ ఒకసారి, ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. 
కొడంగల్ లో సందారం వెంకటయ్య ఒకసారి ఇండిపెండెంటుగా , రెండుసార్లు టిడిపి తరపున గెలవగా ఆయన మరణం తర్వాత 1996లో జరిగిన ఉప ఎన్నికలో వెంకటయ్య కుమారుడు సూర్యనారాయణ గెలిచారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.అచ్యుతరెడ్డి రెండుసార్లు గెలిచారు. 1952లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది, అప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి వీరాస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

Activities are not Found
No results found.